శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
439. కుళేశ్వరీ | ||
కుండలిని శక్తి మనిషియొక్క 72 నాడి సముదాయమునకు ఈశ్వరీ.ముఖ్యప్రాణ స్వరూపిణి. మూలాధారము, స్వాధిష్ఠానము, మణిపురము, అనాహతము, విశుద్ధము, మరియూ ఆజ్ఞా చక్రము అను ఆరు షట్చక్రములకు అధిపతి. 🙏 🌺శరీరములో వున్న సమస్త నాడి సముదాయము నిర్ధిష్ట రీతిలో నడవాలి, అన్న స్ఫురణ కలిగి, ఆరోగ్య సూక్తులను పాటిస్తాము. 🌺 |