శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
499. డామర్యాదిభిరావృతా | ||
డామరము, మొదలైన పదిశక్తి దేవతలచే పరివేష్టింపబడునది. మణిపూర చక్రమునందు పరమేశ్వరీ పది దళ పద్మము మధ్యన నివసించి వున్నది అని క్రిందటి కొన్ని నామములలో తెలుసుకున్నాము. ఒక్కొక దళమున బీజశక్తి దేవతలు, పరమేశ్వరీ యొక్క అంశగా,'డ' నించి 'ఫ వరకు వున్న మాతృకా వర్ణములు, దేవతగా ప్రకాశిస్తూ వున్నవి. అవి 1)డామరి,2)ఢoకారిణి,3)ణామరి,4)తామసి,5)స్థాన్వి,6)దాక్షాయణి,7)ధాత్ర,, 8)నంద,9)పార్వతి,10) ఫట్కారి. దేవీ సేనచె పరివేష్టింపబడిన పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺ఢమరుకము యొక్క కదలికవలే, మన జీర్ణకోశ వ్యవస్థ పనిచేస్తూ, ఆహారమును జీర్ణింప చేస్తుంది. 🌺 |