శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
500. రక్తవర్ణా | ||
ఎర్రని రక్త వర్ణముతో సాక్షాత్కరిస్తుంది. మణిపూర చక్రములో పరమేశ్వరీ రక్త వర్ణపు శరీరకాంతులతో,రక్త వర్ణపు కుంకుమా,పట్టుచీర ధరించివున్నది . రక్త వర్ణమైన మాణిక్యం/ పగడ ఆభరణములు, రక్త వర్ణముతో కూడిన మాణిక్య బంగారు కిరీటము, పొడవైన జుట్టుని కొప్పుగా చుట్టి రక్త వర్ణమైన మందార పూలను సింగారించుకొని, రక్తవర్ణమైన మాణిక్యాల వడ్డాణము, వంకీలు , కెంపుల గాజుల తో, ఇలా,..... తనను రక్తవర్ణా అన్న నామముతో ధ్యానించిన వారిని సాక్షాత్కరిస్తుంది. 🙏 🌺ఏరుపు రంగు జీవ శక్తికి , ప్రాణ చైతన్య స్వరూపమునకు చిహ్నం. ఆ రంగులో దేవిని ధ్యానించిన వారికి, సకల శ్రేయస్సును కలిగిస్తుంది .🌺 |