శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
496. మణిపూరాబ్జ నిలయా | ||
నాభి స్థానచక్రమున నివసించివున్నది పది దళాలతో కూడి వున్న పద్మములో , మణిపూర అన్న పేరు గల చక్రముయందు కొలువై వున్నది. మణి అనగా అక్షర మణులు, వాటిలో నివసించివున్నది అని మరియొక రహస్యం. వయోవస్తా వివర్జితా అన్న దేవీ ఈ మణిపూర చక్రమునకు అధిష్టాత్రీ. ఈ దేవీని వయస్సుతో కూడిన అవస్థలు ఏమియు బాధింపవు. దేహమున నాభి స్థానము దగ్గర నాదరూపిణిగా డాకిని దేవతలచే సేవింపబడుతుంది🙏 🌺శరీరములో కేంద్ర స్థానము నాభి. గర్భములో శిశువు కి తల్లికి మధ్య అనుబంధం నాభి ద్వారా ఏర్పడుతుంది. అదే నాభి శిశువుకి/ జీవుడికి,తల్లి గర్భమునుంచి బయటకు వచ్చాక, ఆరోగ్య రక్షణ నిర్వహిస్తుంది.🌺 |