శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
445. మతి: | ||
సత్ బుద్ధిని ఇచ్చునది బుద్ధి ప్రేరణ చేయు గాయత్రీ స్వరూపము. మాయతో కూడిన ద్వందాలోచన నుండి నివృత్తి కలిగిస్తుంది. సూక్ష్మ రూపములో వున్న తల్లీ మన సంకల్పానికి మానసిక బలాన్ని చేకూరుస్తుంది. తన భక్తులలో బుద్ధిస్వరూపిణిగా వున్న తల్లికి నమస్కారము 🙏 🌺మన సంకల్పానికి ప్రాణముపోసి, పరాశక్తి మనకు అండగా నిలుస్తుంది 🌺 |