శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
404. భక్తహార్దతమోభేద* *భానుమద్భాను సంతతి:* | ||
భక్తులయుక్క హృదయములో వున్న అజ్ఞాన చీకటిని పోగొట్టు సూర్యకిరణముల వంటిది. మనిషిలో వుండే అజ్ఞానము అనగా అహంకారము, దర్పము వంటి లక్షణములను ద్వంసం చేయునట్టిది. 🙏 🌺జీవుడి మనస్సు లో వుండే చీకటిని పొగ్గొట్టి, జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. |