శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
468. సూక్ష్మరూపిణీ | ||
మంత్ర స్వరూపిణీ. మంత్రమును జపించుటచేత దేవి యొక్క సూక్ష్మ దేహము మనకు అవగతమౌతుంది. దేవి, మంత్ర ఉపాసనకు ప్రసన్నురాలవుతుంది. కఠోపనిషత్తులో చెప్పినట్లుగా, దేవి "అణోరణీయాం". చిన్న దానిలో కూడా అతి చిన్నదైనది. అన్నింటా అతి సూక్ష్మరూపిణిగా నిండి వుంది పరమేశ్వరీ. సూక్ష్మరూపము అనగా మంత్రము, మన పంచేంద్రియములకు , జ్ఞానేంద్రియములకు , బుద్ధికి , మనస్సుకి చైతన్య స్వభావము కలిగించి, సూక్ష్మ దేహమున ఆత్మస్వరూపిణిగా నివసిస్తుంది. ఆత్మ సూక్ష్మము.పరమేశ్వరి ఆత్మస్వరూపిణి కాబట్టి, సూక్ష్మరూపిణీ అనబడింది 🙏 🌺సూక్ష్మమైన విషయాలపట్ల శ్రద్ధ వహించి, వాటి విలువను తెలుసుకుంటాము, వృద్ధిలోకి వస్తాము. 🌺 |