శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
484. అమృతాది మహాశక్తి సంవృతా | ||
అమృతాది మొదలైన మహాశక్తులచేత పరివేష్టింపబడునది. దేవీ, విశుద్ధి చక్రమున పదహారు దళ పద్మములో అధిష్టించి,. ఒక్కొక్క దళములో వున్న ప్రాణ అక్షర దేవతలచే సేవింపబడునది. అమృతా అనగా నాశనము కానటువంటి, పదహారు అక్షర ప్రాణ శక్తి దేవతలు,... అమృతా, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉమా, ఊర్థ్వకేశి, ఋద్ధిర, ౠకార, ఌకార, ౡకార, ఏకపదా, ఐశ్వర్యా, ఓంకారి, ఔషధి, అంబికా, అఃక్షర. 'అ'నించి 'క్ష' వరకు వున్నవి ప్రాణ, స్వర అక్షరములు,శక్తి స్వరూపములు . ఐశ్వర్యం వంటి సమస్త భోగాలను ప్రసాదించేవి 🙏. 🌺 ఎల్లవేళలా,పరాశక్తి యొక్క నామములను స్మరించినా, కీర్తించినా సర్వ శుభములు కలుగుతాయి . 🌺 |