శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
447. శాంతి | ||
శాంతి రూపము కలది శాంతి కలగాలి అంటే దానికి మన మనస్సు కారణము. పరోపకారం, దానం, యజ్ఞం, తపం, అనుష్ఠానం, సజ్జన సాంగత్యం, అహింసా మార్గం, ధర్మాచరణ.. ఇవన్నీ సాత్విక గుణ లక్షణాలు. వీటిలో ఏ ఒక్క దానినైనా శ్రద్ధతో ఆచరిస్తే, మనస్సుకు శాంతి కలుగుతుంది. శాంతి స్వభావాన్ని ఇష్టపడే తల్లికి నమస్కారము 🙏 🌺ఓర్పు, సహనం వంటి గుణములు శాంతి స్వభావానికి ప్రతిరూపాలు. వాటిని పొందడం చాలా కష్టసాధ్యం. తల్లీ యొక్క అనుగ్రహముతో వాటిని పొందగలుగుతాము . 🌺 |