శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
469. వజ్రేశ్వరి | ||
శ్రీ చక్రాంతర త్రికోణమునకు ఈశ్వరీ. శ్రీ చక్రమునందు త్రికోణ బింద్యాధి దేవత, వజ్రేశ్వరి అన్న పేరుతో పూజింపబడుతున్న జగదీశ్వరికి నమస్కారము 🙏 వాక్కుకి స్థానము విశుద్ధి చక్రము. దానికి అధిష్టాన దేవి వజ్రేశ్వరి. వివిధ వజ్రాభరణములు ధరించి వున్న ఈశ్వరీ అని కూడా అర్ధం. ఇంద్రునకు దేవి వజ్రాయుధమును ప్రసాదించినది కాబట్టి ఆమె వజ్రేశ్వరియైనది అని కూడా వివరించవచ్చు. 🌺వజ్రము పదునుగా, విలువైనదిగా వున్నట్లే, మన కంఠం నుండి వెలువడే వాక్కు కూడా అంతే పదునుగా, స్పష్టంగా వుంటుంది 🌺 |