శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
489. దంష్ట్రోజ్జ్వలా | ||
మెరయుచున్న పొడవైన దంతములు కలిగి వున్నది. వరాహ మూర్తికి వున్న కోరలు కలది. ప్రాణ శక్తి స్వరూపిణి. రక్త ప్రసరణ, రక్తశుద్ధి చేసే ప్రక్రియ ఈ దంతములతో చేయబడునది. శ్యామ వర్ణముతో వున్న వామదేవియే దంష్ట్రోజ్జ్వలా🙏 🌺బాహ్య శుద్ధి కన్నా,అంత:కరణ శుద్ధి చాలా ముఖ్యమైనది, మోక్షదాయకము 🌺 |