శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
408. శివంకరీ | ||
సర్వ శుభములను ఇచ్చును. మనసా, వాచా, కర్మణా త్రికర్ణ శుద్దిగా తనను కొలిచే భక్తులకు సర్వ శుభములు ఇచ్చును తల్లీ. అవిద్యపాశాన్ని తొలగించి మంగళమును ప్రసాదించును 🙏 🌺ధర్మ సాధన అన్న ప్రక్రియ, ఈశ్వర అనుభూతితో చేస్తే కష్టంగా వున్న పనికూడా సులువుగా చేయగలుగుతాము , సతఫలితాన్ని పొందగలుగుతాము . 🌺 |