శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
455. కామరూపిణీ | ||
సంకల్పమే తన రూపము సంకల్పమాత్రము చేత వాటి రూపమును పొందగలిగిన లక్షణము కలిగి వున్నది కాబట్టి ఆమె కామరూపిణీ. మనలో సంకల్పరూపిణిగా ప్రవేశించి, కోర్కెల ద్వారా సుఖము / దుఃఖములను కలిగించి, ఇంకా తన పాదాలను విడవకుండా పట్టుకున్న భక్తులను తనలో లయం చేసుకుంటుంది. సంకల్పస్వరూపిణియైన తల్లికి నమస్కారము 🙏 🌺ధర్మ సంకల్పము అన్నది, మహా శక్తీ వంతమైనది. వాటి ఫలితము కూడా శుభ పరిణామాన్ని ఇస్తుంది 🌺 |