శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
471. వయోఽవస్థా వివర్జితా | ||
వయస్సుతో కూడిన అవస్థలు లేనటువంటిది జాగృత, స్వప్న, సుషుప్తి అవస్థలకు అతీతమైనది. చైతన్యమూర్తి, పరిణామములకు అతీతమైనది. పాంచభౌతిక పరిణామములు ఆమెను బాధించలేవు. కాలాతీత రూపిణి. ఏ కాలమైన , ఏ వయస్సులోనైనా ధ్యానస్వరూపిణిగా వున్న తల్లికి నమస్కారము 🙏 🌺మనలో ఉత్సాహం , వయస్సుతో నిమిత్తము లేకుండా, ఎల్లపుడు స్థిరంగా వుండగలిగే ప్రజ్ఞత లభిస్తుంది🌺 |