శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
492. కాళరాత్ర్యాది శక్త్యౌఘవృతా | ||
కాళరాత్రి మొదలైన పన్నెండు మంది శక్తి దేవతలచే పరివేష్టింపబడి వున్నది. అనాహత చక్రము యందు పన్నెండు దళాలతో వున్న పద్మములో నివసించి వున్నది. 'క 'నించి 'ఠ' అక్షర బీజములతో దేవీ పూజింపబడుతుంది. 🙏 'క' కారము నుంచి 'ఠ' కారము "ద్వాదశ శక్తులు". అవి 1. కాళరాత్రి 2. ఖాతీత, 3. గాయత్రి 4. ఘంటాధారిణి 5. జామిని 6. చంద్రా 7. ఛాయా 8. జయా 9. ఝుంకారి 10. జ్ఞానరూప 11. టంకహస్తా 12. ఠంకారిణి. 🌺చీకటిలో వెలుగు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో, మన జీవితాల్లో వుండే చీకటి అనే గ్రహ దోషాలను తొలగిస్తుంది . వెలుగుని ప్రసాదిస్తుంది. 🌺 |