శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
493. స్నిగ్ధౌదన ప్రియా | ||
నేతి లేదా చమురుతో కూడిన అన్నము ప్రీతి నేతితో లేదా నూనెతో అన్నమును ఇష్టపడే తల్లి అని లౌకికార్థం. అన్నం అనగానే తెలుపు వర్ణమని కాదు, తెలుపు అన్నది రంగుగా కాకుండా స్వచ్ఛతకు, పరిశుభ్రతకు, మారుపేరు. స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని అంతరార్ధం.🙏 🌺 మనం ఆచరించే కర్మలు స్వచ్ఛంగా ఉండాలని, పులిహోర, కొబ్బరి అన్నం వంటి, ప్రసాదములను అమ్మవారికి నివేదించాలి. మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే చేసే పనులు అంత స్వచ్ఛంగా శుభ ఫలితాన్ని ఇస్తుంది. దేనికైనా శ్రద్ధా, భక్తి ప్రధానము.🌺 |