శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
472. సిద్ధేశ్వరీ | ||
సంకల్పాన్ని సిద్ధి కలిగించే ఈశ్వరీ. సిద్ధులకు ఈశ్వరీ. యోగ శాస్త్రములచేత మహర్షులకు సిద్ధులను ప్రసాదించే తల్లి. స్వాధిష్టాన చక్రమునకు అధిదేవతా సిద్ధేశ్వరీ. సర్వ సిద్ధులను ప్రసాదించే పరమేశ్వరీ. ఈశ్వర సంకల్పాన్ని సిద్ధసంకల్పముచేసే శక్తి రూపిణియే సిద్ధేశ్వరీ 🙏 🌺కీర్తి లభిస్తుంది. 🌺 |