శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
491. రుధిర సంస్థితా | ||
దేహమున రక్త ధాతువునందు ఆశ్రయించివున్నది. 'రుధిర' అనగా రక్తము.జీవుల దేహమున రక్త ప్రసరణ ద్వారా వారిని సంరక్షిస్తుంది. శరీరములో రక్తమంతా హృదయము నుండి మిగితా అవయవాలకు ప్రసరణ జరుగుతుంది. ఈ దేవికి ఆవునేతితో కలిపిన అన్నము చాలా ప్రీతి. ముఖ్యముగా గర్భిణీ స్త్రీ, మొదటి ముద్ద అన్నము నెయ్యి వేసుకొనే తినాలి అని పెద్దలు చెప్పారు, లోపల వున్న శిశువుకి క్షేమకరము. జీవుడి యొక్క రక్త ప్రసరణ ప్రక్రియని ఆశ్రయించివున్న పరమేశ్వరీయే రుధిర సంస్థితా🙏. 🌺 శరీరములో రక్త ప్రసరణ చాలా ముఖ్యము. దానికి సంబందించిన అనారోగ్యం ఏమైనా వుంటే పరమేశ్వరి యొక్క కృపతో రోగం నుంచి ముక్తి కలిగిస్తుంది🌺 |