శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
416. చిచ్ఛక్తి | ||
జ్ఞాన శక్తి రూపము. సర్వ జీవరాసులయందు ఇచ్చా శక్తి, జ్ఞానశక్తి, క్రియా శక్తిగా వుంటుంది. చిచ్ఛక్తి ని చిదగ్ని అని కూడా అందురు. అగ్ని యందు సర్వ శక్తులు వున్నవి. ఈ అగ్నియే సర్వము భక్షించగలదు, సర్వమును సృష్టించగలదు. అదృష్య శక్తిగా మనలో ఇచ్చా, జ్ఞాన, క్రియా చైతన్యాన్ని కలిగించే రూపమే చిచ్ఛక్తి:. మనలో ఈ ప్రాణ శక్తి లేనిచో, శవము అవుతాము.🙏 🌺మన ఇంద్రియాలలో శక్తి ప్రవేశించి, బద్ధకం, నీరసం వంటి లక్షణాలను దూరంచేస్తుంది, చైతన్యవంతముగా వుంచుతుంది. 🌺 |