శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
452. తేజోవతీ | ||
ప్రకాశవంతమైనది. తల్లి తన తేజస్సును సూర్య, చంద్ర, నక్షత్రములకు కాంతి రూపేణా ప్రసాదించి, వాటి వెలుగును ఈ భూమిమీద ప్రకాశిస్తుంది. మనిషిలో వుండే అజ్ఞానాన్ని పోగొట్టి ఆత్మసాక్షాత్కారమైన వెలుగును ప్రసాదిస్తుంది 🙏 🌺వెలుగు లేనిచోట చైతన్యము వుండదు. వెలుగు లోనే పరమాత్మ కలదు. మన ఇంట్లో రెండు పూటలా దీపారాధన చేసి , చీకటిని,అజ్ఞానాన్ని తొలగించుకుంటాము. "దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్ధనా, దీపం హరతుమే పాపం, దీపరాజా నమోస్తుతే "🌺 |