శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
405. శివధుతీ | ||
పరమశివునకు దుతిక అనగా సదాశివుని సంకల్ప ప్రధాన కారణము అయినది. కాళికా దేవియోక్క రూపము. ప్రపంచాతీతుడు అగు పరమశివుడి దుతికగా సంచరిస్తున్న శక్తికే శివదూతీ అని పేరు. ఈ ప్రపంచమున సృష్టి, స్థితి, సంహారములు చేయుచున్న శ్రీ మాతయే శివధూతి. శరీరములో మూలాధారమునుండి సమస్త క్రియలను చేయించుచున్న శక్తి యోక్క కుండలిని పేరే శివధూతి.🙏 🌺సంకల్పము ధర్మభద్ధముగా వుంటే, ఎన్ని ఆటంకములు ఎదురైనా, కాళికా రూపము దాల్చి ఆ సంకల్పన్ని దిగ్విజయముగా పూర్తి చేస్తుంది. 🌺 |