శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
486. అనాహతాబ్జనిలయా | ||
అనాహత చక్రమున నివసించునది అనాహత పద్మము హృదయ ప్రాంతములో వుంటుంది. శబ్దము, ఒకరు కొడితేగాని పుట్టదు. అలా కొట్టబడకుండానే శబ్దము పుట్టే చోటు హృదయము. అందువలనే హృదయ పద్మ స్థానమునకు 'అనాహతము' అని పేరు వచ్చింది. వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది. శరీరములో ఉఛ్వాస, నిశ్వాసను క్రమ పద్దతిగా నియంత్రిస్తుంది. ఈ అనాహత పద్మం పన్నెండు దళాలు కలిగి ఉంటుంది. అక్షరాల్లోని హల్లులో 'క' నుండి 'ఠ' కారం దాకా వుండే పన్నెండు హల్లులకు సంబంధించిన బీజాలు ఈ అనాహత పద్మంలో ఉంటాయి. అనాహత పద్మము నందు నివసించే పరమేశ్వరికి నమస్కారము 🙏. 🌺 భక్తుల యొక్క ఉఛ్వాస, నిశ్వాసను, రక్త ప్రసరణను క్రమ పద్దతిగా నియంత్రిస్తుంది.🌺 |