శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
454. లోలాక్షీ | ||
చంచలమైన, సౌందర్యమైన, విశాలమైన కన్నులు కలది అమ్మవారి కన్నులు పూర్తిగా మూయనంతవరకే , ఈ సృష్టి వుంటుంది. అమ్మవారి సౌందర్య రూపము, తను సృష్టించిన మనిషికి ప్రసాదిస్తుంది. వారి వారి పుణ్య ఫలముతో, కొంతమంది స్ఫురద్రౄపులుగా,తన పోలికలైన సౌందర్య రూపముతో, కన్నులతో, వాక్కుతో, సంస్కారముతో, ప్రజ్ఞా వంతులుగా జన్మిస్తారు. నిరంతరమూ అమ్మవారి పూజలో, ధ్యానములో, జపములో నిమగ్నమైన వారిలో పరాశక్తి రూపముకదలాడుతుంది 🙏 🌺ముఖములో వర్చస్సు కనిపిస్తుంది. 🌺 |