శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
498. వజ్రాదికాయుధోపేతా | ||
వజ్రం మొదలైన ఆయుధములను ధరించి వున్నది మూడు ముఖములతో , వజ్రం, శూలం, పాశం, కపాలం అన్న నాలుగు ఆయుధములను ధరించి, అభయ హస్తముద్రలతో వుంటుంది. మేధ అనే దాతువునకు అధిదేవత. దధ్యాన్నం అంటే ప్రీతి వజ్రము చురుకుదనానికి, పట్టుత్వానికి, దృఢ సంకల్పానికి సంకేతము. మేధా శక్తి స్వరూపిణియైన లలితా పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺మనలో వుండే జ్ఞానమును, మేధా శక్తిని పెంచుతుంది . 🌺 |