శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
435. చాంపేయ కుసుమప్రియా | ||
సంపెంగ పువ్వులయందు ప్రీతి కలది సౌమ్యమైన గుణము, సత్వగుణములు కలిగినది. భ్రమరము వాలని పుష్పము దేవి పూజకి పనికి రాదు అని అంటారు,.. కాని ఈ సంపెంగ పువ్వు మీద భ్రమరము/తుమ్మెద వాలక పోయిన, సంపెంగ పువ్వుకున్న గంధాకర్షణ, రూపాకర్షణ, రసాకర్షణచే,దేవికి చాలా ప్రీతి. అందునకు దేవి పూజ కి పనికొస్తుంది. పంచెంద్రియములకు లొంగని జీవుడు, దేవికి ప్రీతి అన్నది ఈ నామము యొక్క అంతరార్ధము, రహస్యము. దేవికి,అత్యంత ప్రీతిపాత్రమైన రంగు ఎఱుపు, తెలుపు,బంగారము. అనగా బంగారము/ సువర్ణ రంగులో వున్న సంపెంగ పువ్వులతో లలితాపరమేశ్వరికి పూజ చేస్తే, దేవి యొక్క కారుణ్యము మనపైన కురుస్తుంది🙏 🌺పరిస్థితులకు లోబడకుండా, ధర్మ పరంగా, వివేకంతో సమస్యలను పరిష్కరించుకుంటాము. దేవికి ప్రీతి పాత్రులమైతాము 🌺 |