శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
480. వదనైక సుమన్వితా | ||
ఏక ముఖీ, ముఖ్య ప్రాణ స్వరూపిణి బ్రహ్మాజ్ఞానముతో ప్రకాశిస్తున్న ముఖము. మధురమైన కంఠము, చిరునవ్వు చిందిస్తున్న ముఖముతో, సృష్టి నిర్మాణం చేస్తూ, సమస్త ప్రాణకోటికి, ముఖ్య ప్రాణ స్వరూపిణిగా పోషణ కలిగిస్తుంది, సంరక్షిస్తుంది, దుష్టులను శిక్షిస్తూ, సృష్టి, స్థితి, లయము అన్నింటినీ సమన్వయ పరుస్తుంది. ముఖ్యప్రాణ స్వరూపిణిగా,లోక మాత పరా భట్టారికా లలితా పరమేశ్వరీ. 🙏 🌺మనలో వుండే ప్రాణ శక్తి యొక్క విలువ తెలుసుకుంటాము 🌺 |