మూడు ముఖములతో ప్రకాశించునది
సత్త్వ , రజో , తమో గుణములుగా,
సృష్టి, స్థితి, లయ సాక్షి రూపిణిగా,
భూత, భవిష్యత్, వర్తమానములకు చైతన్యరూపిణిగా, సంకేతాన్ని ఇస్తుంది వదనత్రయ సంయుతా అన్న నామము.
ఈ దేవీ కూడా మణిపూర స్థానమున నివసించి వున్నది. ఆమె రక్త వర్ణముతో, మూడు శిరస్సులతో, వజ్రం శక్తి, దండం అన్న అభయముద్రములను ధరించి వుంటుంది. ఈ దేవీ, మాంస అనే దాతువునకు అధిదేవత. గుడాన్నం చాలా ప్రీతి.
ఈ నామము ద్వారా బాలాత్రిపురసుందరి దేవీని స్మరణ చేసుకొని, భక్తితో ఆరాధించాలి.
'బాలా' , 'త్రిపుర,' 'సుందరి ' అని మూడు ముఖములుగా ధ్యానించాలి. త్రిశక్తి స్వరూపిణియైన లలితా పరమేశ్వరియే బాలాత్రిపురసుందరి 🙏
🌺దేవీ యొక్క ఆరాధనతో సమస్త శారీరక బలహీనతలను పోగొట్టి, దృడమైన, బలమైన దేహాన్ని ప్రసాదిస్తుంది 🌺 |