శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
483. పశులోక భయంకరీ | ||
పశు' పదం పశు ప్రవృత్తిని సూచిస్తుంది,'లోక' అంటే తాను విహరిస్తున్న, 'భయంకరి' భయము కలిగించునది. పశు ప్రవృత్తి లో సంచరించేవారికి , భయమును కలిగించునది. తనను గురించి చాలా ఎక్కువగా చెప్పుకోవడం ,పరులను తక్కువ చేసి , హీనంగా మాట్లాడడం, నాది, నేను అన్న మమకారమే పశులక్షణాన్ని సూచిస్తాయి. ద్వంద భావము వున్న వారికి భయమును కలిగిస్తుంది. ద్వైత భావాన్ని పోగొట్టి, అద్వైత భావాన్ని కలిగించడమే ఈ నామనికి అర్ధం. 🙏 🌺 అద్వైత భావంతో చేసే ఆలోచన, క్రియ ఎంతో పవిత్రమైనది, శ్రేష్ఠమైనది అని తెలుసుకుంటాము. 🌺 |