శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
476. విశుద్ధిచక్ర నిలయా | ||
వాక్రూపిణి. కంఠ స్థానమునకు అధిపతి విశుద్దిచక్రము. విశుద్ది చక్రమునకు సంబందించిన పద్మము శ్వేత రంగులో, పదహారు దళాలు కలిగి వుంటుంది. విశుద్ది అనగా వాక్కు కు సంబంధించినది. మనలో శుద్ధి వుంటే దేనిలోనైనా సిద్ధిని పొందుతాము. భాహ్య శుద్ధి తో పాటు, అంతః కరణ శుద్ధి వుండాలి.వాక్కుని ప్రసాదించే విశుద్ది చక్రములో నివసించే పరమేశ్వరికి నమస్కారము 🙏 🌺వాక్కులో, మనస్సుతో , చేసే ప్రతి పనిలో శుద్ధి వుంటేనే కార్యసిద్ధి పొందుతాము. 🌺 |