శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
470. వామదేవీ | ||
సౌందర్యవతి, ఎడమ భాగము, అర్ధనారిశ్వరి, వ్యక్త పరచడము. అతిలోక సుందరియైన పరమేశ్వరియే వామదేవి. ఈశ్వరినియొక్క ఎడమ భాగమున వున్న దేవి. విశ్వాన్ని పాలించే అర్ధనారిశ్వరి తత్వము గల దేవి. ఈశ్వరునికి ఐదు ముఖములు, అవి సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. వీటిలో ఉత్తరముఖము వామదేవ,.. అయిన దేవీ కాబట్టి వామదేవీ అని పిలవబడుతుంది. క్లిష్టమైన సమస్యను, సులువుగా వ్యక్త పరచగల శక్తివున్న దేవీ 🙏 🌺సర్వ శుభములను కలిగించును 🌺 |