శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
433. మదపాటల గండభూ: | ||
ఎరుపు మెరుపుల చెక్కిళ్ళు పరాశక్తి యొక్క కన్నులు, చెక్కిళ్ళు యందు ఈ సృష్టి ప్రతిభింబిస్తూవుంటుంది. సంకల్పములు సఫలికృతమైనప్పుడు, చెక్కిళ్ళు ఏఱుపేక్కుతాయి. ఏఱుపేక్కిన చెక్కిళ్ళతో శోభిస్తున్న తల్లికి నమస్కారము 🙏 🌺మన కోర్కెలు, సంకల్పములు, పరాశక్తి యొక్క చెక్కిళ్ళపై ప్రతిభింబిస్తూ, సమయానుకూలముగా, అమ్మవారి కృపతో తిరుతాయి.🌺 |