శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
424. తత్త్వాసనా | ||
తత్వములే ఆసనము గలది. సర్వ తత్వస్వరూపిణియైన గాయత్రీ మాతయే తత్త్వాసనా 36 తాత్వములను తన ఆసనముగా చేసుకున్నది. అవి పంచ భూతములు(5), పంచెంద్రియములు (5),పంచకర్మేంద్రియములు(5), పంచకోశములు (5),పంచ తన్మాత్రములు (5), పంచప్రాణవాయు(5),మనో,బుద్ధి,చిత్త అహంకార, ప్రకృతి, ఈశ్వరుడు ఇవ్వని 36 తత్వములు పరాశక్తికి ఆసనములు. వీటిమీద ఆసినురాలైన తల్లికి నమస్కారము 🙏 🌺మనలో, మన భావనలో, మాటలో, చర్యలో, ఫలితములో సర్వత్రా ఆ జగన్మాత యొక్క అనుగ్రహమే కనబడుతుంది. మనలో ఆసీనురాలై వుంటుంది 🌺 |