శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
202. సర్వేశ్వరీ | ||
బ్రహ్మండం అంత నిండి వున్నది. ఆ జగజనని సర్వేశ్వరీ. సకలమునకు ఈశ్వరి. కావున సర్వేశ్వరీ. సకల చరాచర జగత్తుకు పరమేశ్వరి. సర్వలోకాలకు ఈశ్వరి అయిన ఆ తల్లికి నమస్కారము 🙏 🌺లోకేశ్వరి అయిన ఆ తల్లీ, తనను నమ్ముకున్న భక్తులకు వారు వెళ్ళవలసిన దారి తప్పిపోకుండా, వారికి మార్గదర్శకత్వం వహిస్తుంది.🌺 |