శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
296. అనాదినిధనా | ||
ఆది అంతము లేనిది. జననమరణాదులనుంచి విముక్తి చేయుట. తన భక్తులకు మరణ భయమును పోగొట్టుతుంది.పాపకుపమునుండి బైటకు లాగి మోక్ష మార్గము వైపు దారి చూపిస్తుంది. అనాదినిధన అంటే ఆధ్యాంతరహిత అని అర్ధము. ఆది, మధ్య, అంతా అన్నింటికి ఆమెయే జనని.జనన మరణాదుల రహితమైన శక్తి స్వరూపిణి. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ఆత్మకు మరణము లేదు. ప్రతిఒక్క ఆత్మ లో దాగి వున్నది జనని. ఆత్మలో చైతన్య నిరంతరమూ ప్రవహిస్తువుంటుంది అన్న నిజాన్ని తెలుసుకుంటాము, పరులకు తెలపగలుగుతాము 🌺 |