శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
205. సర్వయంత్రాత్మీకా | ||
సకల యంత్రములు ఆ పరదేవతా స్వరూపములే. ఆ తల్లీ అన్ని యంత్రములలో బీజారుపముగా ఆ శక్తి కలిగి వున్నది. సర్వ యంత్రములకు కేంద్రబిందువు వుంటుంది. అదియే సర్వయంత్రాత్మీకా. శ్రీచక్రమే సర్వయంత్రములకు మాతృక. అందులో వున్న బిందుయే సర్వయంత్రాత్మీకా. సర్వ యంత్రస్వరూపిణి. అదియే పరాశక్తి. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ఈ ప్రపంచమంతా బింధువు తో ప్రారంభమయినది. ఆ బింధువు నుండి రేఖలు, కోణాలు ఒక క్రమపద్దతిగా నిర్మించబడుతాయి. మనందరమూ ఆ యంత్రములో అణువులము. ఈ యంత్రము మన దేహములో వుండి మనని క్రమ పద్దతిలో నడుపిస్తుంది.🌺 |