శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
270. తిరోధానకరీ | ||
విశ్వములో వున్న అణువులు, ధాతువులు, పంచభూతములు కలిస్తే సృష్టికి అనురూపము కలిగించిన ఈశ్వరుని దగ్గరకు మరల తిరిగి వెళ్ళటం తిరోధానము. ఈ తిరోధానమును చేసి శక్తియే తిరోధానకరీ. ఇది కల్పాoతములో జరుగుతుంది. ఈ క్రియను చేయగలిగినది పరాశక్తియే కాబట్టి ఆమె తిరోధానకరీ. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺 సంకల్పమునకు పరిపూర్ణ ఫలితము కలిగిన పిమ్మట, మరల ఇంకో సంకల్పానికి మనము సిద్ధ పడుతాము.(ఇక్కడ మన నిజ జీవితములో,సంకల్పాన్ని సృష్టిగా భావించాలి )ఈ మధ్య వ్యవధిలో మనలో చైతన్యము దాగి వుంటుంది. చైతన్య శక్తియే తిరోధానకరీ.🌺 |