శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
212. మహారూపా | ||
అన్ని రూపాలు తానైవున్నది. మహారూపా అంటే మహావీరాటస్వరూపము. ఆరు ఆకాశములు తానైయై, ఆరవ ఆకాశమునుండి జన్మించిన సప్తదాతువులు, నవనిధులు, అష్టదిక్కులు, పంచెభూతములు, 84లక్షల జీవరాషులయుక్క సముదాయములన్నియూ ఆమె గర్భవమునందే వున్నవి కాబట్టి ఆ తల్లీ మహారూపా. ఆమెయే విరాటస్వరూపిణి , దుర్గా. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ప్రతి జీవుడు, మానవుడు ఆ మహారూపా యుక్క రూపము అని భావించి,. అన్నిటిలో, అందరిలోను విశిష్టతను చూడగలిగే తత్వం ఏర్పడుతుంది 🌺 |