శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
268. సంహారిణీ | ||
సమస్తము తన నుండి ఉదభవింపచేసి, మరల తనలోనే లయము చేసుకునేది ఎవరో తానే సంహారిణీ. మహాప్రళయ కాలమునందు, జీవులను నాశనము చేయు వాడు పరమశివుడు. ఆయనలో శక్తి అయిన జగన్మాత, శివతత్త్వము కలిగి వున్నది. కనుక సంహారిణీ అని స్తుతింపపడుతున్నది. మన దేహములో వుండే కుండలినీ శక్తి ద్వారా అజ్ఞాచక్రానికి చేరుకునే మధ్యలో వచ్చే ఆట్టంకాలన్నిటిని సంహారస్తుంది. ప్రళయ స్వరూపిణీయైన తల్లికి నమస్కారము 🙏 🌺జీవుడి యుక్క దుష్టభావములను నశింపచేస్తుంది. లౌకిక జీవితములో, చేసిన పనికి గుర్తుంపు రూపేణ ఆశిస్తాము ప్రతి వొక్కరము. గుర్తింపు దొరకని యెడల, అసంతృప్తి, నిరాశ చెందుతాము. తత్తద్వారా ధార్మిక సమూహమునకు దూరమ అవుతాము. అటువంటి నిరాశ, అసంతృప్తిని నాశనము చేసి, ధార్మిక సమూహములో వుంటూ నిరంతర భక్తి భావనే ప్రధానము. గుర్తింపు, కీర్తి కాదు అన్న వివేకం కలుగుతుంది.🌺 |