శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
274. పంచకృత్య పరాయణా | ||
సృష్టి, స్థితి, లయ, తిరోదాన, అనుగ్రహ అన్న పంచకృత్యములను తానే నిర్వర్తిస్తున్నది. పంచ కృత్యములకు లోనైనదే ధర్మము. ధర్మము తానే సృష్టిస్తుంది, అధర్మము తానే సృష్టిస్తుంది. ఈ రెండింటికి మధ్య భేదం తెలిసిన నాడు, వాటి రెండింటికి అతితముగా వున్నప్పుడు,మానవుడుకి పరాశక్తి సాక్షాత్కారము లభిస్తుంది. పంచకృత్యమునకు అతీతముగా వున్న తల్లికి నమస్కారము 🙏 🌺మానవ జీవితములో పంచకృత్యములు మనస్సు ద్వారా 1.సంకల్పము 2 బుద్ధి నిశ్చయము 3 చింతనము 4. క్రియా 5. సంపూర్ణము సంకల్పాన్ని యందు మనస్సుకు అహంకారము అహంభావము, అనురాగము, వత్సల్యము లేకుండా వుండటమే పంచకృత్య పరాయణము 🌺 |