శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
213. మహాపూజ్యా | ||
పూజింపదగినది. శ్రీచక్రగత బిందువే పరాపూజ్య. అదియే మహాపూజ్య. జడచైతన్య రూపములో వున్న సృష్టి అంతటికినీ అంతర్గతముగా వుండే స్వరూపిణి. సకల దేవతలచే, సకల జనులచే పూజింపబడున్నట్టిది. దేవతలు త్రిమూర్తులను ఆశ్రయించును, ఆ త్రిమూర్తులు జగన్మాతను ఆశ్రయించి పూజింతురు. ఆ తల్లికి నమస్కారము 🙏. 🌺అన్నిటిలోనూ విశిష్టతను గ్రహించగలుగుతుంది మన మనస్సు. అందరిని పూజనీయులుగా చూడగలిగే స్థాయికి చేరుకోగలుగుతాము. ఆ తత్వం గలిగిన మనము కూడా పూజనీయులుగా కనిపిస్తాము, గౌరవింపబడతాము.🌺 |