శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
258. స్వపంతి | ||
స్వప్న రూపమైనది. సూక్ష్మ దేహముగా వున్న తల్లీ. స్వప్నములో సూక్ష్మ భావముగా కనుబడుతుంది. వాసనాదులచే మనస్సు సంచరించే మిధ్యాలోకం. సూక్ష్మ భావనగా కనబడే తల్లికి నమస్కారము 🙏 🌺 స్వప్న అవస్థ అన్నది మనిషికి ధ్యానములో రెండొవ మెట్టు. అహర్నిశలు విగ్రహ ఆరాధనను చేస్తూ,దేవి నామస్మరణతో, స్వప్నములో కూడా దేవి మనకి సూక్ష్మ రూపములో కనబడుతుంది. మన నిత్య జీవనములో,దేనిమీదైతే ఏకాగ్రత చూపుతామో,.. అదియే మరల స్వప్నములో మనకి కనపడుతుంది. ఆ పరా దేవి రూపమును ధ్యానిస్తే, ఆ తల్లీ మనకి స్వప్న రూపములో కనబడుతుంది. మనకి విజయాన్ని ఇస్తుంది.🌺 |