శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
252. పరమానందా | ||
పరమ అన్నది ఈశ్వర పదార్తము. ఈశ్వర సంకల్పమే ఆ జగజ్జనని కి పరమానందా. మానవ జీవితములో సుఖము, దుఃఖము రెండు కోణములు. సుఖముగా వున్నపుడు ఆనందము. దుఃఖములో వున్నపుడు భాద. ఈ లక్షణాలు ప్రతి మానవుడికి సహజం. సుఖము - దుఃఖము అన్న మాయనించి, మానవుడు యేనాడైతే విముక్తి చెందుతాడో,.. అంటే అన్ని భావాలు ఈశ్వరార్పణ చేస్తాడో , అదియే పరమానంద. పరమానంద స్వరూపిణి అయిన పరాశక్తికి నమస్కారము 🙏 🌺మానవ సేవే మాధవ సేవ అన్నది ధర్మ వాక్యం . ప్రతి మనషి, తన లాంటివాడే. ఎదుటివాడి భాద తన భాద, ఎదుటివాడి ఆనందం తన ఆనందము అని భావించే విజ్ఞానం కలుగుతుంది. ఆ ఆనందం పరమానందం అని తెలుసుకుంటాము 🌺 |