శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
279. భగవతీ | ||
భగ అన్న శబ్దము, ఐశ్వరయము, జ్ఞాన సంపద, కలిగి వున్నది అని అర్ధము. భగ అనగా షద్గుణసంపత్తి అని ఇంతకు పూర్వమే తెలుసుకున్నాము. దేవి భాగవత పురాణములో చెప్పబడినది " ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రీయః । జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీ రణ " భగవతి అంటే ఈ ఆరు ఐశ్వర్యములను అనంతగా కలిగి వున్న వారు అని - శక్తి, జ్ఞానము, సౌందర్యము, యశస్సు, ఐశ్వర్యము మరియు వైరాగ్యము." ఈ లక్షణములు దేవతలు, దానవులు, మానవులలో పరిమితమైన బుద్దిని కలిగి వున్నవారిని దేవుడితో సమంగా భగవతి అని అంటారు. భగవతి రూపములో వున్న పరాశక్తికి నమస్కారము 🙏 🌺శక్తితో కూడిన లక్షణాలు,మనకి ధ్యానముతో, భగవంతుడి నామ జపముతో సాధ్యం అన్న జ్ఞానము కలుగుతుంది 🌺 |