శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
290. సకలాగమసందోహశుక్తి సంపుట మౌక్తికా | ||
*సకలా* అనగా సమస్తమైన, *ఆగమ* అనగా వేద శాస్త్రములయొక్క, *సందోహ* అనగా సముదాయము, *శుక్తి* అనగా ముత్యపు చిప్ప, *సంపుట* అనగా సమూహము వేద, వేదాంతములయందు ఏ బ్రాహ్మజ్ఞానము చెప్పబడివుందో, వాటన్నినిటీ సారము. సమస్త నాదములు తనయందే సంపటీకరీంపబడి వున్నవి అని అర్ధం.సకల ఆగమములు జగన్మాతకు ఆభరణమై వున్నవి. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మన ఆలోచనలు, ధర్మము పట్ల, శాస్త్రాలు పట్ల స్వచ్చమైన ముత్యము వలే మెరుస్తూ కనిపిస్తాయి .🌺 |