శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
228. మహాయంత్రా | ||
మహాయంత్రా అంటే అక్షరపరమాత్మ యుక్క రూపము శ్రీచక్రము. ఏ యంత్రమైన శక్తికి గుర్తు. నామ్మరూపాత్మకము కూడా శక్తియే. ఈ సృష్టియే విరాట స్వరూపము. విరాట స్వరూపమునకు ప్రతీక శ్రీచక్రము. శ్రీచక్రము సృష్టి, స్థితి, లయాత్మక శక్తి ప్రేరణాయంత్రం. అట్టి యంత్రమునకు అధిష్టాత్రి లలితా త్రిపుర సుందరి. ఆమెయే మహాయంత్రా. అట్టి ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మన నియమానికి కట్టుబడి వుంటాము. ఏ రకమైన ప్రభావాలకు లోనుకాకుండా మన పనిని ధర్మ భదంగా చేయగలుగుతాము, విజయము సాధించగలుగుతాము.🌺 |