శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
276. భైరవీ | ||
భైరవ అనగా ఈశ్వర పధార్ధము. భ్రమాoడమును మరల సృష్టించటానికి, చైతన్య రక్త బింధువుగా ఉద్భవించిన శక్తియే భైరవీ. భైరవీ లో 'భ' అనగా కాంతి 'రవి'అనగా సూర్యుడు. అంటే సూర్య కాంతి లో వుండును భైరవీ. కాంతి స్వరూపిణీ. ఎక్కడ కాంతి వున్నదో, అక్కడే చైతన్య శక్తి దాగి వుండును. ఈశ్వరుని యొక్క చైతన్య శక్తియైన పరా శక్తికి నమస్కారము 🙏 🌺చైతన్యము అన్నది మన శ్వాస తోపాటు జనిస్తుంది. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ వల్ల మనిషి మెదడు తేలికవుతుంది. కొత్త శక్తి మనలో ప్రవేసిస్తుంది.🌺 |