శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
256. విశ్వరూపా | ||
విశ్వ స్వరూపము తానే యైనది. జగత్తును స్వరూపముగా ధరించి వున్నది. సృష్టి, స్థితి, లయ అంతయు తానే నిండి వున్నది. ఆది, మధ్య, అంతము తానై వున్నది. శ్రీ చక్ర స్వరూపిణి. ఏక శబ్దముతో పరమాత్మలో , ద్విశబ్దముతో ఆత్మ పరమాత్మలో , త్రీ శబ్దముతో త్రిమూర్తులలో, చతుర్ధ శబ్దముతో నాలుగు వేదాములో, పంచభూతములో, పంచతన్మాత్ర స్వరూపముతో,... అలా అన్నింటిలో వర్ధిల్లుతున్నది. విశ్వరూప అంతటా చైతన్యాన్ని ఇస్తున్న తల్లికి నమస్కారము 🙏. 🌺ప్రపంచమంతా ప్రకృతి రూపములో నిండి వున్న ఆ తల్లీ, మనతోనే వున్నది అన్న భావన కలుగుతుంది. మనము చేసే ధర్మ కార్యాల వల్ల ప్రకృతి శాంతిస్తుంది, అనుగ్రహిస్తుంది.🌺 |