శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
261. ప్రాజ్ఞాత్మీకా | ||
ప్రాజ్ఞుడు స్వరూపము గలది. అంటే కారణ దేహములో సుషుప్తి స్థితి లో వున్న అభిమానిని వారిని ప్రాజ్ఞుడు అందురు. ఆయన ఎవరు అంటే ఈశ్వరుడు. అంటే ప్రాజ్ఞు జీవులు యొక్క సమిష్టి స్వరూపమైనటువంటి ఈశ్వరుని స్వరూపమే తానుగా ఉన్నటువంటిది. జ్ఞాన స్వరూపిణి. జీవులకు కొత్త జ్ఞానాన్ని ప్రసాదించే తల్లీ. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺ఆధ్యాత్మిక పరిపూర్ణ ధ్యాన స్థితి లో నేనే పరమాత్మ అన్న స్థితి. తాను చేసే ప్రతి పనిలో ఈశ్వరుడు వున్నాడు అన్న స్థితి. ఆ తల్లీ అశీసులతో, కొత్త విషయాలు మనకి బోధ పడుతాయి 🌺 |