శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
298. నారాయణీ | ||
పరా శక్తియే నారాయణీ. అనంత శక్తి ఏదైతే ఈ సృష్టికి ములకరణమై వున్నదో అదియే నారాయణము. నీరు లేనిదే సృష్టి వుండదు. నారము అన్న, నిరము అన్న ఒక్కటే. మానవ శరీరము ఉదానవాయువు చేత రూపము దరిస్తుంది. ఉదానవాయువే మనయెందున్న సూక్ష్మమైన జలము. మానవ శరీరములో 80 శాతము నీరే వున్నది. నీళ్ల శాతము శరీరములో తగ్గినప్పుడు, అనారోగ్యపాలైతాము. ఉదానవాయువు రూపములో వున్న నారాయణి ని జాగ్రత్తగా చుసుకోవాలి. నారాయణి సరిగ్గా వున్నపుడే ఆరోగ్యము బాగుంటుంది. కాబట్టి సృష్టికి కారణమైన మూల ప్రకృతి ఏదో అదియే నారాయణి. పద్మనాభూనియొక్క సహోదరియే నారాయణీ. " *సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే"* సర్వమంగళ మాంగళ్యే = శుభకరమైన వాటన్నింట మంగళకరమైనది (సర్వమంగళ నామము చేత మంగళ స్వరూపురాలైనది); శివే = శివ సతి అయిన శక్తి లేదా పార్వతి; సర్వ = అన్ని;సమస్త సృష్టి అర్థ = అర్థములను (ధర్మ+అర్థ+కామ+మోక్ష అను చతుర్విధ పురుషార్థములు); సాధికే = సాధించినది; శరణ్యే = శరణము/ఆశ్రయము కల్పించేది; త్రంబకి = త్రి + అంబకి = మూడు కన్నులు గలవాని సతి అనగా పార్వతి; దేవి = పరమేశ్వరి ; నారాయణి = పార్వతి; నమోస్తుతే = నీకు; నమః = నమస్కారము/ప్రణామము;🙏 🌺సర్వ శుభములను కలిగించే ఆలోచనలు, దైవగుణము, శాంతగుణమును పొందుతాము 🌺 |