శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
207. మనోన్మని | ||
రుద్రుని మనోన్మని. మనస్సునకు మనస్సు అయినది. మనస్సు యుక్క ఉన్మనాస్థితి, అంటే ఆజ్ఞాచక్రమునందు కనిపించుట. మనస్సులోనూ, హృదయములోనూ వున్న చాపల్య భావములను వదిలిపెట్టి, కేవలం జ్యోతిగా ప్రాణాన్ని మార్చటమే మనోన్మనిస్థితి. మోక్షమునకు స్థానం వంటిది. ఎట్టి భావములు లేని నిశ్చలతకు, రాగాదులు వర్జింపబడిన మానసిక స్థితికి సంకేతము. ఆ తల్లికి నమస్కారము 🙏 🌺మన మానవ దేహములో భాహ్య శుద్ధి తో పాటు అంతరశుద్ధి కూడా ఉండేలా మన మనస్సు ని నియంత్రించ గలుగుతాము 🌺 |